ETV Bharat / state

రేషన్ బియ్యంతో బంతులు.. నివ్వెరపోయిన లబ్ధిదారులు

author img

By

Published : Dec 10, 2019, 7:51 PM IST

రేషన్ బియ్యంతో అన్నం వండి దానిని ముద్దగా చేస్తే ప్లాస్టిక్ బంతి తయారవుతోందని కరీంనగర్ జిల్లా వాసులు చెబుతున్నారు.

plastic
రేషన్ బియ్యంతో ప్లాస్టిక్ బంతి చేసుకోవచ్చు

కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం నవాబుపేట గ్రామంలో రేషన్ బియ్యం కలకలం రేపింది. ప్రతినెలా మాదిరిగానే డిసెంబర్ 6న రేషన్ దుకాణం నుంచి బియ్యం తెచ్చుకొని మంగళవారం ఉదయం వండుకొని తిందామనుకున్నారు బోయిని శ్రీకాంత్. ఈ రోజు ఉదయం తన భార్య రేషన్ బియ్యం అన్నం వండి టమాటా కూరతో శ్రీకాంత్​కు అన్నం పెట్టగా... కూర శ్రీకాంత్​కు నచ్చలేదు. అయితే ఉత్త అన్నాన్నే కలుపుతుండగా.... బంతి మాదిరిగా ముద్ద గట్టిగా అయింది. అనుమానం వచ్చి ముద్దను నేలమీద కొట్టగా అన్నం బంతిలా ఎగిరింది.

పండించిన బియ్యం నేలకు అతుక్కుపోతోంది

అవాక్కయైన శ్రీకాంత్ పక్కింటి వారికి చూపించాడు. రేషన్ బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం ఉండవచ్చని కాలనీవాసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేవలం శ్రీకాంత్ ఇంట్లోనే కాకుండా చుట్టుపక్కల ఐదారు ఇళ్ళల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. పండించిన బియ్యంతో అన్నం చేసి చూద్దామనుకొని వండి ముద్దలా చేసి నేలకు కొట్టగా అది నేలకు అతుక్కుపోయింది.

రేషన్ బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం కలిసిందని గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమకు మంచి బియ్యాన్ని అందించాలని కోరుకుంటున్నారు. వెంటనే రేషన్ బియ్యంపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

రేషన్ బియ్యంతో ప్లాస్టిక్ బంతి చేసుకోవచ్చు

ఇవీ చూడండి: 'కాళేశ్వ‌రం ప్రాజెక్టు.. తెలంగాణకు ఓ మ‌కుటాయ‌మానం'

Intro:TG_KRN_101_10_RATION RICE_ANDHOLANA_AVB_TS10085
REPORTER:KAMALAKAR 9441842417
---------------------------------------------------------------------------- కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం నవాబుపేట గ్రామంలో రేషన్ బియ్యం కలకలం రేపింది. ప్రతినెల మాదిరిగానే డిసెంబర్ 6న రేషన్ దుకాణం నుండి రేషన్ బియ్యం తెచ్చుకొని మంగళవారం ఉదయం వండుకొని తిందామనుకున్నారు. అయితే అన్నం ముద్దగా చేస్తుండగా బంతి మాదిరిగా ముద్ద గట్టిగా కావడంతో అనుమానం వచ్చింది. దీంతో రేషన్ బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం ఉండవచ్చని కాలనీవాసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదే గ్రామానికి చెందిన బోయిని శ్రీకాంత్ ఈరోజు ఉదయం తన భార్య రేషన్ బియ్యం అన్నం వండి టమాటా కూరతో శ్రీకాంత్ కు అన్నం పెట్టగా టమాటా కూర శ్రీకాంత్ కు నచ్చకపోవడంతో అన్నాన్ని ముద్దచేసి నేలమీద కొట్టగా అన్నం బంతిలాగా ఎగరడంతో ఇదేమిటని శ్రీకాంత్ అవాక్కయ్యాడు. చుట్టుపక్కల ఇంటివారికి విషయం చెప్పడంతో ఐదారు ఇళ్ళల్లో ఇదే పరిస్థితి నెలకొంది. రేషన్ బియ్యం పై అనుమానం వ్యక్తం చేస్తున్న కాలనీవాసులు రేషన్ బియ్యం కాకుండా వండిన బియ్యన్నే వండుకునే తింటున్నామన్నారు. రేషన్ బియ్యంపై విచారణ చేపట్టాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు. పండించిన బియ్యాన్ని వండుకొని ముద్దలా చేసి నేలకు కొట్టగా అది నేలకు అతుక్కుపోయింది. దీంతో రేషన్ బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం కలిసిందని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమకు మంచి బియ్యాన్ని అందించాలని కోరుకుంటున్నారు.

Body:బైట్స్

1) బోయిని శ్రీకాంత్ బాధితుడు నవాబుపేట
2) పిల్లి తిరుపతి నవాబుపేట
3) భారతమ్మ నవాబుపేట

Conclusion:రేషన్ బియ్యం లో ప్లాస్టిక్ బియ్యం కలిసిందంటూ గ్రామస్తుల ఆందోళన

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.