Pigeon Created A Stir In Khammam District: తెలంగాణకు ఆనుకుని ఉన్న సరిహద్దు ప్రాంతమైన ఆంధ్రప్రదేశ్లో ఒక పావురం కలకలం రేపింది. అల్లూరి సీతారామరాజు జిల్లా యటపాక మండలం గొల్లగూడెం గ్రామంలో ఒక పావురం ప్రత్యక్షమైంది. గోదావరి ఒడ్డున ఉండే మత్స్యకార కుటుంబ సభ్యులకు ఈ పావురం కనపడింది. పావురానికి ట్యాగ్ కట్టి ఉండటంతో స్థానికులను ఆందోళనకు గురయ్యారు.
Pigeon Created A Stir In Gollagudem Village: దీంతో ఆ గ్రామంలో రకరకాల ఊహాగానాలు వెల్లవెత్తాయి. ఈ పావురం దొరికిన విషయాన్ని మత్యకారులు పోలీసులకు తెలిపారు. దీనిపై పోలీసు అధికారులు విచారణ చేపట్టారు. ఆయితే పావురానికి జీపీయస్ వంటి ట్యాగ్ కట్టి ఉండటంతో ఈ విషయం స్థానికంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇంటి మీదకి పావురం వచ్చిందని, దానిని పట్టుకొని చూస్తే ఒక కాలుకి ట్యాగ్ వేసి ఉందని మత్స్యకారులు తెలిపారు.
ఇది ఇలా ఉండగా, అన్ని రకాల పందేల మాదిరిగానే ఇటీవలే పావురాల పెందేలను నిర్వహించటం సాదారణంగా మారింది. పావురాలకు ముందుగానే శిక్షణ ఇస్తారు. పూర్తి శిక్షణ ఇచ్చాకా, దానిని పందేలలోకి దించుతారు. రూ.కోట్లల్లో చేతులు మారే ఈ పందేలలో భాగంగా పావురాల కాళ్లకు ట్యాగ్లు కట్టి వీటిని గుంపులు గుంపులుగా వదులుతారు.
ఈ ట్యాగ్ల ద్వారా ఏ పావురం ముందు తిరిగి గమ్యానికి చేరుకుంటుందో అంచనా వేసి ఆ పావురాన్ని, వాటి యజమానులను విజేతలుగా ప్రకటిస్తుంటారు. కాగా అన్ని అంశాలతో పాటు ఈ దిశగా కూడా స్థానికి పోలీసు అధికారులు విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఏపీ పోలీసులు ఈ పావురాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
'ఇంటిమీద శబ్దం వచ్చింది. ఈ శబ్దం ఏంటి అని చూస్తే గద్ద, పావురాన్ని పట్టుకుని పొడిచేస్తుంది. అయితే ఆ రెండు కొట్టుకుని కింద పడిపోయాయి. దక్కకు వెళ్లి చూస్తే పావురం అక్కడ ఉండిపోయింది. గద్ద వెళ్లిపోయింది. ఆ పావురాన్ని పట్టుకొని చూస్తే కాలికి స్టిక్కర్ ఉంది. ఈ మేరకు స్థానికులను అడిగితే ఇది మాములు పావురం కాదని చెప్పడం జరిగింది. దీంతో మేము పోలీసులకు చెప్పాం'. -మత్స్యకారులు
ఇవీ చదవండి: