పౌరసత్వ సవరణ చట్టంను వ్యతిరేకిస్తూ... ఖమ్మం జిల్లా వైరాలో పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. మోదీ, అమిత్‌షా దిష్టిబొమ్మలతో ప్రదర్శనగా రింగ్‌రోడ్ కూడలికి చేరుకుని వాటిని దగ్ధం చేశారు. రాజ్యాంగంలో ప్రాథమిక అంశాలకు భంగం కలిగించే విధంగా బిల్లును ప్రవేశపెట్టారని ఆరోపించారు. ఈ బిల్లు ద్వారా భారతదేశంలో లౌకికతత్వం, ప్రజాస్వామ్యం దెబ్బతింటుందన్నారు.
ఇదీ చూడండి: ఆగని రాక్షసత్వం: మతిలేని యువతిపై అమానవీయకాండ!