సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం మీన్పూర్లో పని ఒత్తిడితో ఆత్మహత్యకు పాల్పడిన కార్యదర్శి జగన్నాథం కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఖమ్మం జిల్లా వైరా, ఏన్కూరుల్లో పంచాయతీ కార్యదర్శులు కోరారు.
మండల పరిషత్ కార్యాలయం ఎదుట జగన్నాథం చిత్రపటానికి నివాళులు అర్పించి నిరసన తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న కార్యదర్శి కుటుంబానికి ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
అతని కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని కోరారు. కార్యదర్శుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పని ఒత్తిడి కారణంగా ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన చెందారు.
ఇదీ చూడండి: 'ఎల్ఐసీని అంబానీ, అదానీలకు అప్పగించేందుకు కుట్ర'