ఖమ్మం ఉమ్మడి జిల్లాలో సహకార ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. చాలా వరకు సొసైటీలు ఏకగ్రీవం కాగా... మిగతా చోట్ల... నువ్వానేనా అన్నట్లుగా పోటీ నడుస్తోంది. వివిధ పార్టీల పొత్తుతో బరిలోకి దిగిన అభ్యర్థులు.. ఓటర్లను కలిసి తమను గెలిపించాలని కోరుతున్నారు.
ఏన్కూరు మండలంలో తెరాస, కాంగ్రెస్‌ల మధ్య గట్టి పోటీ ఉండగా... అభ్యర్థులు ముమ్మర ప్రచారం చేస్తున్నారు. తమ గుర్తులను సూచిస్తూ... ఓటు తమకే వేయాలంటూ ప్రాదేయపడుతున్నారు. కారేపల్లి, జూలూరుపాడు, వైరా, కొణిజర్ల, తల్లాడ మండలాల్లోనూ సంఘాల వారీగా ప్రచారం ఊపందుకుంది.
ఇదీ చూడండి : ఆప్ కీ దిల్లీ: మరోసారి దిల్లీ పీఠంపై 'సామాన్యుడు'