ETV Bharat / state

చెప్పుల ఖరీదు అక్షరాల లక్ష రూపాయలు - స్నాప్​డీల్​

ఆన్​లైన్​లో ఏమైనా ఆర్డర్ చేస్తున్నారా..! అయితే మీరు ఈ వార్త చదవాల్సిందే. అవునూ..మీలాగే స్నాప్​డీల్​లో రూ.799కి చెప్పులు ఆర్డర్​ చేశారు. డెలివరీ కూడా అయ్యాయి. కానీ అతని ఖాతా నుంచి అక్షరాల లక్షా 22వేలు మాయమయ్యాయి.

చెప్పుల ఖరీదు అక్షరాల లక్ష రూపాయలు
author img

By

Published : Jul 31, 2019, 5:01 PM IST

చెప్పుల ఖరీదు అక్షరాల లక్ష రూపాయలు
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలానికి చెందిన చిట్టూరి సత్యనారాయణ ఈ నెల 21న స్నాప్​డీల్​లో 799 రూపాయల చెప్పులు ఆర్డర్​ చేశాడు. జులై 26న డెలివరీ అయ్యాయి. అయితే ఆ చెప్పులు నచ్చకపోవడం వల్ల సదరు కంపెనీకి ఫోన్ చేసి డబ్బులు ఇవ్వమని అడిగాడు. ఫోన్​కు లింక్​ వస్తుందని దాన్ని ఫార్వర్డ్​ చేయాలని కంపెనీ వారు సూచించారు. సత్యనారాయణ వచ్చిన లింక్​ను ఫార్వర్డ్​ చేశాడు. కొద్ది క్షణాల్లోనే రూ.19 వేలు డ్రా అయినట్లు మెసేజ్​ వచ్చింది. తక్షణమే స్పందించిన బాధితుడు సమీపంలోని ఎస్బీఐ బ్యాంకుకు వెళ్లి తన ఖాతాను బ్లాక్ చేయాలని కోరేలోపే మరో 80 వేలు డ్రా అయ్యాయి. మంగళవారం ఖమ్మం సైబర్​ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేస్తుండగా మరో 22 వేలు డ్రా అయినట్లు మెసేజ్​ వచ్చింది. సుమారు లక్షా 22 వేలు డ్రా అయినట్లు బాధితుడు తెలిపాడు. ఖాతాను బ్లాక్​ చేయించిన తర్వాత కూడా డబ్బు ఎలా డ్రా అయిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.