ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం కేసుపల్లికి చెందిన ఎన్‌ఆర్‌ఐ దంపతులు సరళ, డాక్టర్ పాండురంగారావులు లాక్డౌన్ వేళ తమ ఉదారతను చాటుకున్నారు. 950 మంది వలస కూలీలకు నిత్యావసరాలు పంపిణీ చేసి, తమ ఔదార్యాన్ని చాటారు. రూ. లక్షా 50వేల విలువైన సరుకులు అందించారు. మలేషియాలో స్థిరపడిన వీరు... స్థానిక పరిస్థితులు తెలుసుకొని కూలీలకు చేయూతగా నిలిచేందుకు ముందుకు వచ్చారు. ఈ కార్యక్రమంలో దాతల కుటుంబసభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు. మానవతా దృక్పథంతో ముందుకొచ్చిన ఎన్‌ఆర్‌ఐ దంపతులను స్థానికులు అభినందించారు.
ఇవీ చూడండి: వలస కార్మికులను అడ్డుకున్న పోలీసులు