ETV Bharat / state

కరోనా వ్యాప్తి నియంత్రణపై నిర్లక్ష్యం.. దడ పుట్టిస్తున్న రద్దీ ప్రాంతాలు

పెరుగుతున్న కొవిడ్‌ కేసులు కలవరపెడుతున్నాయి. వైరస్‌ వేగంగా విస్తరిస్తోంది. జనం రద్దీగా ఉండే ప్రాంతాలు వణిస్తున్నాయి. గుంపులుగా చేరడం, మాస్క్‌లు ధరించకపోవడం, శానిటైజ్‌పై నిర్లక్ష్యం ఆందోళన కలిగిస్తున్నాయి. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వ్యాపార, వాణిజ్య సముదాయాల వద్ద నియంత్రణ చర్యలపై దృష్టి సారిస్తున్నారు. కరోనా పాజిటివ్‌ గుర్తించిన ప్రాంతాల్లో పనివేళల కుదింపు అంశం ఇటీవల తెరపైకి వచ్చింది. ఒకటి తర్వాత ఒకటి అన్నట్లు ఆయా వర్తక సంఘాలు స్వచ్ఛంద లాక్‌డౌన్‌లు అమలు చేస్తున్నారు. వైరస్‌ నివారణకు తాము తీసుకుంటున్న చర్యలను హర్షణీయమే.. అయినా మిగతా వేళల్లోనూ నిబంధనలు పాటించాల్సిన ఆవశ్యకత ఉంది. నిర్వాహకులతోపాటు వినియోగదారులు కూడా బాధ్యతగా వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు.

కరోనా వ్యాప్తి నియంత్రణపై నిర్లక్ష్యం.. దడ పుట్టిస్తున్న రద్దీ ప్రాంతాలు
కరోనా వ్యాప్తి నియంత్రణపై నిర్లక్ష్యం.. దడ పుట్టిస్తున్న రద్దీ ప్రాంతాలు
author img

By

Published : Jul 28, 2020, 12:02 PM IST

స్వచ్ఛంద లాక్‌డౌన్‌... పనివేళలు కుదింపు

ప్రజల్లో మార్పు రావడం లేదని గమనించి వ్యాపార వర్గాలు కొందరు స్వచ్ఛంద లాక్‌డౌన్‌ ప్రకటించారు. ఖమ్మం గాంధీచౌక్‌లోని కిరాణా జాగిరి మర్చంట్స్‌ వారు, బంగారు దుకాణం నిర్వాహకులు, ఐరన్‌, స్టీల్‌ అండ్‌ మెటల్‌వారు ఈనెల చివరి వరకు స్వచ్ఛంద లాక్‌డౌన్‌కు పిలుపునిచ్చారు. ఉభయ జిల్లాల్లో మెకానిక్‌షాపులు, టీ, సెల్‌ఫోన్‌ దుకాణాలతో పాటు ఇతర వ్యాపార సముదాయాలను సాయంత్రం ఆరుగంటల వరకే తెరచిఉంచాలని నిర్ణయించారు. కరోనా కట్టడికి పనివేళల కుదింపు విషయం తెలిసినా కొందరు అవేమి పట్టకుండా దుకాణం ముందుగానే మూసివేస్తారనే ఆత్రుతలో నిబంధనలు విస్మరిస్తున్నారు.

గీత దాటుతున్నారు...

ఒకరికి ఒకరు కనీసం రెండు మీటర్ల దూరం ఉండాలనే నిబంధన ఉంది. లాక్‌డౌన్‌ మొదట్లో ప్రతి దుకాణం ఎదుట రంగులు, సుద్ద తదితరాలతో నిర్దేశిత నిడివిలో వలయాలు గీశారు. దీన్ని లక్ష్మణరేఖగా అభివర్ణించారు. అందులోనే నిలుచుని తమ వంతువరకు వేచిచూసి అక్కడ అవసరమైన సామగ్రి కొనుగోలు చేశారు. అంతవరకు బాగానే ఉంది.. అన్‌లాక్‌ నుంచి నిబంధనలు తోసిరాజంటున్నారు. దుకాణ సముదాయాల వద్ద గుంపులు కడుతున్నారు. భౌతిక దూరం భారమని భావిస్తే మున్ముందు వైరస్‌ బాధలు తప్పవని గ్రహించాలి.

మాస్క్‌లు ఓ మోస్తరు

లాక్‌డౌన్‌ సమయంలో మాస్క్‌ల కొరత తీవ్రంగా ఏర్పడింది. వస్త్రాలతో విరివిగా తయారు చేయడం వల్ల అందుబాటులోకి వచ్చాయి. వినియోగంపై చైతన్యం పెరిగింది. మాస్క్‌ ధరించిన వారికే దుకాణంలోకి అనుమతి అని, వారికే సరకులు ఇస్తామని బోర్డులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీంతో కొంతమేర ఆశించినట్లే జరుగుతున్నా ఇందులోనూ లోపాలుంటున్నాయి. నాణ్యత, వాటి వినియోగంపైనా శ్రద్ధ చూపడంలేదు.

కేసులు పెరుగుతున్నా మార్పు రావట్లే...

లాక్‌డౌన్‌ నాళ్లలో భద్రాద్రి జిల్లాలో నాలుగు, ఖమ్మంలో ఒక కేసు తేలడం వల్ల ప్రజలు భయకంపితులయ్యారు. అందుకనుగుణంగా అధికారులు, ప్రభుత్వవర్గాలు చర్యలు తీసుకోవడం వల్ల జనం ఇళ్లకే పరిమితమయ్యారు. ఆంక్షల సడలింపులు, అధికార యంత్రాంగం కూడా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నందున అధికులు బాధ్యత విస్మరిస్తున్నారు.

ప్రాథమిక సూత్రాలు.. ఉల్లంఘన

ప్రధానంగా పట్టణాల్లో జనసాంద్రత ఎక్కువగా ఉండే కిరాణా దుకాణాలు, ఆసుపత్రులు, ఏటీఎం సెంటర్లు, వస్త్రవ్యాపార సంస్థలు, బంగారు దుకాణాలు, శాకాహార, మాంసాహార మార్కెట్లు, ఆటోలు, టాక్సీలు, బస్సు ప్రయాణాల్లో సహా ఇతర వ్యాపార, వాణిజ్య సముదాయాల్లో నిబంధనలు ఎక్కువగా ఉల్లంఘన జరుగుతుంది.

శానిటైజర్‌ సగం.. సగం

వైరస్‌ వ్యాప్తి నివారించడంలో శానిటైజర్‌దీ ప్రధాన పాత్రే. వాటిని ఇంటింటా సమకూర్చుకుంటున్నారు. బయటికి వెళ్లినప్పుడు కూడా చిన్న పరిమాణంలో తీసుకెళుతున్నారు. శానిటైజర్‌తో చేతులు శుభ్ర పరుచుకుని థర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్ష అనంతరమే దుకాణంలోకి అనుమతించాలి. కార్పొరేట్‌, ఇతర పెద్ద దుకాణాల్లోనే ఇది జరుగుతోంది. థర్మల్‌ స్క్రీనింగ్‌ పనిచేయదు. శానిటైజర్‌ సీసా ఖాళీగానే దర్శనమిస్తుంది. ఉమ్మడి జిల్లాలో ఎక్కువ చోట్ల ఇదే పరిస్థితి. ఈ రెండింటినీ పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయాల్సిన అవసరముంది.

మా వంతు బాధ్యతగా...

"కరోనాను నియంత్రించేందుకు మావంతు బాధ్యతగా స్వచ్ఛంద లాక్‌డౌన్‌ విధించి అమలు చేస్తున్నాం. చిన్న దుకాణాల నుంచి సూపర్‌మార్కెట్లు, మాల్స్‌ల నిర్వాహకులంతా భాగస్వాములవుతున్నారు. దుకాణాల వద్ద వినియోగదారులు శానిటైజర్‌ను వినియోగించుకోవడం, భౌతికదూరం పాటించడం, విధిగా మాస్క్‌లు ధరించేలా అవగాహన కల్పిస్తున్నాం.”

- పెండ్యాల కృష్ణమూర్తి, వర్తక సంఘం అధ్యక్షుడు, పాల్వంచ

నిబంధనలు కఠినతరం చేస్తాం

"నిబంధనలు ఇక కఠినతరం చేయాల్సిన పరిస్థితి మళ్లీ నెలకొంది. ఉల్లంఘనకు పాల్పడిన వారికి జరిమానాలు విధించినప్పటికీ వారిలో మార్పుకానరావడంలేదు. అందుకే వేరే రకమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించాం. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఉల్లంఘనకు పాల్పడే వారిపై ఇకనుంచి ఎపిడమిక్‌ డీసీజ్‌ యాక్ట్‌ కింద కూడా కేసులు నమోదు చేస్తాం.”

-మూడో పట్టణ ఠాణా ఎస్‌హెచ్‌వో, సి.హెచ్‌. శ్రీధర్‌

కట్టడి అవుతుందనే ఆలోచనతో స్వచ్ఛంద లాక్‌డౌన్‌

"కరోనా వైరస్‌ వ్యాప్తి అధికంగా ఉందని చెప్పి గాంధీచౌక్‌లో స్వచ్ఛంద లాక్‌డౌన్‌ పాటించాలని నిర్ణయం తీసుకున్నాం. ఇక్కడ రోజుకి మూడు నుంచి నాలుగు వేల మందితో దుకాణాలు రద్దీగా ఉంటాయి. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలోని పలు జిల్లాలకు చెందిన లారీలు, ఆటోలు సరకుల దిగుమతికి వస్తుంటాయి. వారి ద్వారా కూడా వైరస్‌ వ్యాప్తి చెందుతుందనే అనుమానం ఉంది. ఈ నేపథ్యంలో కనీసం వారంరోజుల పాటు లాక్‌డౌన్‌ పాటిస్తే వైరస్‌ కట్టడి అవుతుందనే భావిస్తున్నాం.”

-వేములపల్లి వెంకటేశ్వరరావు, కిరాణా జాగిరి మర్చంట్స్‌ అసోసియేషన్‌ ఖమ్మం నగర అధ్యక్షుడు

ఇదీ చదవండి : 'సచివాలయ కూల్చివేత ఎలా జరుగుతోంది.. వ్యర్థాల పరిస్థితి ఏంటి?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.