ఖమ్మం జిల్లా మధిరలోని పలు పాఠశాలల్లో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు తమ సృజనాత్మకను చాటేలా వైజ్ఞానిక నమూనాలు తయారు చేసి ప్రదర్శించారు. విద్యావేత్తల నుంచి ప్రశంసలు అందుకున్నారు.
తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం :
ఈ ప్రదర్శనలో సౌరశక్తితో వ్యవసాయ పంటలు పండించి, తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయాన్ని పొందే విధానాన్ని తయారు చేశారు. విద్యుత్ దుర్వినియోగం కాకుండా పట్టణాలు, గ్రామాల్లో వీధి దీపాలు రాత్రి వేళ వెలిగి, ఉదయం ఆటోమేటిక్గా ఆగిపోయేలా నమూనా రూపొందిచారు. ఈ సందర్భంగా పలు పాఠశాలల్లో ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
ఇవీ చూడండి:500 బస్సుల 'గిన్నిస్' యాత్ర