ఖమ్మం జిల్లా వైరా పట్టణంలో సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్లకు వ్యతిరేకంగా ముస్లింలు శుక్రవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. స్థానిక మసీదు సెంటర్ నుంచి రింగ్‌రోడ్ వరకు జాతీయ జెండాలతో ప్రదర్శనలో పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇవీ చూడండి: నేడే డీసీసీబీ, డీసీఎంఎస్ ఛైర్మన్ ఎన్నికలు