ETV Bharat / state

మినీ పురపోరులో గెలుపే లక్ష్యంగా పార్టీల ప్రచారం

author img

By

Published : Apr 25, 2021, 7:33 PM IST

రాష్ట్రంలో జరగనున్న మినీ పోరులో గెలుపే లక్ష్యంగా అధికార, ప్రతిపక్ష పార్టీలు హోరాహోరీగా ప్రచారం సాగిస్తున్నాయి. గడువు మరో రెండ్రోజులే మిగిలి ఉండటంతో... మంత్రులు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర స్థాయి నేతలు విస్తృతంగా పర్యటిస్తున్నారు. అభ్యర్థులు డివిజన్లలో విస్తృతంగా పర్యటిస్తూ... తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఓటర్ల ప్రసన్నానికి మరికొందరు కాళ్లు మొక్కుతూ... ఓట్లు అభ్యర్థిస్తున్నారు.

muncipal elections compaign
మినీ పురపోరులో గెలుపే లక్ష్యంగా పార్టీల ప్రచారం

మినీ పురపోరులో గెలుపే లక్ష్యంగా పార్టీల ప్రచారం

వరంగల్‌, ఖమ్మం నగర పాలక సంస్థలతో పాటు ఎన్నికలు జరుగుతున్న మున్సిపాలిటీలకు ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రచార గడువు మరో రెండ్రోజులు మాత్రమే ఉండటంతో పార్టీల నేతలు విస్తృతంగా పర్యటిస్తూ గెలుపు కోసం శ్రమిస్తున్నారు. హసన్‌పర్తి మండలం పెగడపల్లిలో తెరాస అభ్యర్థులతో కలిసి పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. భాజపా చేస్తున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దని... అభివృద్ధికి అడ్డంకిగా మారిన ప్రతిపక్షాలకు బుద్ధిచెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. మంత్రులు కొప్పుల ఈశ్వర్‌, సత్యవతి రాఠోడ్‌... వరంగల్‌ తూర్పు నియోజకవర్గంలో రోడ్‌షో నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాలుగో స్థానానికి పడిపోయిన భాజపా... తమ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తే సహించబోమని సత్యవతి హెచ్చరించారు. 59వ డివిజన్‌లో పర్యటించిన కరీంనగర్‌ మేయర్‌ సునీల్‌రావు... తెరాస అభ్యర్థిని గెలిపించాలని కోరారు.

భాజపా, తెరాస వైఫల్యం చెందాయని..

కాజీపేటలోని కడిపికొండలో భాజపా నేత రేవూరి ప్రకాశ్‌రెడ్డి ప్రచారం నిర్వహించారు. నగరంలోని పలు డివిజన్లలో కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి పార్టీ నేతలతో కలిసి పర్యటించారు. వరంగల్‌ తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థితో కలిసి ఆ పార్టీ నాయకురాలు కొండా సురేఖ ప్రచారం నిర్వహించారు. పరకాలలో కాంగ్రెస్‌ నేత ఇనగాల వెంకట్రాంరెడ్డి పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేశారు. వరంగల్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థులకు మద్దతుగా ఆ పార్టీ నేత వి.హన్మంతరావు ప్రచారం నిర్వహించారు. ప్రజలకిచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో భాజపా, తెరాస వైఫల్యం చెందాయని ఆయన ఆరోపించారు.

జోరుగా ప్రచారం

ఖమ్మం కార్పొరేషన్‌లో పార్టీల ప్రచారం జోరుగా సాగుతోంది. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, మాజీ మంత్రి తుమ్మల, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసి... తెరాస అభ్యర్థులకు మద్దతుగా పలు డివిజన్లలో ప్రచారం నిర్వహించారు. ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వానికి మద్దతునివ్వాలని కోరారు.

ఖమ్మంలో బండి సంజయ్​

ఖమ్మంలో భాజపా అభ్యర్థులకు మద్దతుగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రోడ్‌షో నిర్వహించారు. నగర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం వందల కోట్ల నిధులు ఇస్తే... పేర్లు మార్చుకుని తెరాస సర్కార్‌ గొప్పలు చెప్పుకుంటుందని ఆరోపించారు. తమ పార్టీకి ఒక్క కార్పొరేటర్‌ లేకున్నా పెద్దఎత్తున నిధులు మంజూరు చేశామని... భాజపాకు పట్టం కడితే నగరం మరింత అభివృద్ధి పథంలో పయనిస్తుందని చెప్పారు.

సిద్దిపేటలో ప్రచార జోరు

సిద్దిపేట మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. భాజపా అభ్యర్థులకు మద్దతుగా ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి తరుణ్‌చుగ్‌ ప్రచారం చేశారు. తెరాస పాలనపై ఛార్జ్‌షీట్‌ విడుదల చేసిన ఆయన... హరీశ్‌రావు ఈ ప్రాంతానికి ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారని ప్రశ్నించారు. తెరాస అభ్యర్థులను గెలిపించాలంటూ... మంత్రి హరీశ్‌రావు ప్రచారం నిర్వహించారు. తమ హయాంలో చేపట్టిన అభివృద్ధిని ప్రజలకు వివరించిన ఆయన... భవిష్యత్‌లో మరింత అభివృద్ధి సాధించేందుకు ప్రజలు తెరాసకు మద్దతునివ్వాలని కోరారు.

వివేక్​ ప్రచారం

నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేటలో భాజపా నేత వివేక్‌ ప్రచారం చేశారు. శనివారం తెరాస-భాజపా శ్రేణుల మధ్య జరిగిన ఘర్షణల్లో గాయపడిన పార్టీ కార్యకర్తలను ఆయన పరామర్శించారు.

ఇదీ చదవండి: వైద్య, ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వ అనుమతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.