ఖమ్మం రైల్వేస్టేషన్‌లోని సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని లోక్‌సభ సభ్యులు నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఉదయం రైల్వేస్టేషన్‌ను సందర్శించి.. పరిసరాలను పరిశీలించారు. ప్రయాణికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఖమ్మం రైల్వే అధికారులతో మాట్లాడి పెండింగ్ రైల్వే లైన్లు, కొత్తగా రావాల్సిన ప్రాజెక్టుల వివరాలపై ఆరా తీశారు. వేసవి కాలంలో తాగునీటి సమస్య పరిష్కరిస్తామని హామీనిచ్చారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సి ఉందని... జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేస్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైల్వే సమస్యలు పరిష్కారానికి కేంద్రంతో సంప్రదించి కృషి చేస్తానని భరోసానిచ్చారు.
ఇది చదవండి: ఎన్కౌంటర్ శంకర్‌తో 'ఇస్మార్ట్ శంకర్'