ఖమ్మం జిల్లా గోపవరంలో తపాలా కార్యాలయం ఎదుట మహిళలు ఆందోళన చేశారు. తాము పోస్టాఫీసుల్లో పొదుపు చేసిన నగదు రికార్డుల్లో లేకపోవడంపై నిరసనకు దిగారు. వివిధ పథకాల కింద దాచుకున్న డబ్బులు తీసుకుందామని వెళ్లిన మహిళా ఖాతాదారులకు నిరాశే ఎదురైంది. తాము దాచుకున్న సొమ్ము వివరాలు అడిగితే తపాలా అధికారిణి సరైన సమాధానం ఇవ్వడం లేదంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత నెల రోజులుగా ఇదే నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ వాపోయారు. ఈ విషయంపై విచారణ జరపాలని మహిళలు కోరుతున్నారు. నగదు మాయం కావడంపై పోలీసులకు సమాచారమందించారు.
ఇదీ చూడండి : స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ పోరు నేడే!