ఖమ్మం జిల్లా ప్రధాన ప్రభుత్వ ఆస్పత్రిని స్థానిక ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ ఆకస్మికంగా పరిశీలించారు. ఆసుపత్రిని, మాతాశిశు ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. వైద్యులు సరిగా విధులు హాజరు కాకపోవాటాన్ని గుర్తించిన ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట్లు ఖర్చు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆసుపత్రుల్లో మౌలిక వసతులు కల్పిస్తుంటే కొంతమంది కావాలనే ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే విధంగా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి: అశ్లీల వెబ్ సైట్లో యువతి పేరు.. గూగుల్‌కు హైకోర్టు నోటీసులు