గ్రామాలే దేశానికి పట్టుగొమ్మలు అనే గాంధీజీ మాటలకు స్ఫూర్తిగా ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గుర్వాయిగూడెంలో రూ. 25 లక్షల జాతీయ ఉపాధి హామీ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
అనంతరం కొత్త కారాయిగూడెంలో జాతీయ ఉపాధి హామీ పథకం, దాత సహకారంతో నిర్మించిన వైకుంఠధామాన్ని ప్రారంభించారు. పల్లెప్రగతిలో ప్రతి ఒక్కరూ కృషి చేసి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.