ETV Bharat / state

రిక్షా కార్మికులకు అండగా నిలిచిన ఎమ్మెల్యే సండ్ర

తెరాస ప్రభుత్వం.. గ్రామాల్లో ఐసోలేషన్​ కేంద్రాలను ఏర్పాటు చేసి బాధితులకు భోజన సౌకర్యంతో పాటు మందులు అందిస్తోందని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తెలిపారు. లాక్​డౌన్​ కారణంగా ఉపాధి కోల్పోయిన పలు పేద కుటుంబాలకు ఆయన నిత్యావసరాలను పంపిణీ చేశారు.

Sattupalli mla
Sattupalli mla
author img

By

Published : May 30, 2021, 9:29 PM IST

లాక్​డౌన్ కారణంగా జీవనోపాధి కోల్పోయిన పలువురు రిక్షా కార్మికుల కుటుంబాలకు.. ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య నిత్యావసరాలను పంపిణీ చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణ పరిధిలో.. గతేడాది లాక్​డౌన్​లో కూడా అనేక కార్యక్రమాలను చేపట్టినట్లు గుర్తు చేశారు. నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ సౌకర్యాలతో కూడిన పడకలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

తెరాస ప్రభుత్వం.. గ్రామాల్లో ఐసోలేషన్​ కేంద్రాలను ఏర్పాటు చేసి బాధితులకు భోజన సౌకర్యంతో పాటు మందులు అందిస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. లాక్​డౌన్​కు ప్రజలంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ మహేశ్, కమిషనర్ సుజాత తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: Kishan Reddy: ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన కార్పొరేటర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.