ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు రైతు పక్షపాతిగా నిలుస్తున్నాయని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కొత్తూరులో రైతు వేదిక నిర్మాణం శిలాఫలకాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు.
రైతులు పండించిన పంటకు వారే గిట్టుబాటు ధరపై నిర్ణయం తీసుకునేందుకే రైతు వేదికలకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారని తెలిపారు. ఇందులో వ్యవసాయ అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉంటారని... అన్నదాతలు వారి సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఇదీ చూడండి : వంద క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత