గ్రామాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు దేశంలోనే ఆదర్శనీయమని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం కొడవటి మెట్టు, తెలగవరం గ్రామాల్లో ప్రకృతి వనం శంకుస్థాపన, వైకుంఠధామాన్ని ప్రారంభించారు. పల్లె ప్రగతిలో భాగంగా చేపడుతున్న పథకాల్లో ప్రకృతి వనం ఆహ్లాదాన్ని పంచుతుందన్నారు.
వైకుంఠధామం నిర్మాణాలు సత్తుపల్లి నియోజకవర్గంలో 95 శాతం పూర్తయ్యాయని, రాష్ట్రంలోనే ఆదర్శంగా సంక్షేమ పథకాల అమలులో ముందున్నామని ఎమ్మెల్యే అన్నారు. పలు చోట్ల మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ ఛైర్మన్ రాయల వెంకట శేషగిరిరావు, జడ్పీటీసీ దిరిశాల ప్రమీల, సర్పంచులు నిర్మల, కృష్ణయ్య, తెరాస మండల అధ్యక్ష కార్యదర్శులు మోహన్ రెడ్డి, దుగ్గి దేవర వెంకట లాల్, తెరాస నాయకులు పాల్గొన్నారు.