ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ అభివృద్దికి ప్రాధాన్యత ఇస్తున్నారని ఎమ్మెల్యే రాములు నాయక్ తెలిపారు. ఖమ్మం జిల్లాలో వైరా జలాశయం గేట్ల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి నీటిని దిగువకు విడుదల చేశారు. రైతుబంధు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా వేలాది ఎకరాలు సస్యశ్యామలం చేస్తున్నారన్నారని చెప్పారు.
ఆయకట్టలో పరిధిలో చేపట్టే వరిసాగుకు సరిపడా నీరు అందిస్తామన్నారు. నీటిని వృథా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఇదీ చూడండి: 'రాజకీయ ప్రయోజనాల కోసం కాదు.. భావి తరాల కోసం'