ప్రత్యేక రాష్ట్రంలో.. ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలను తీసుకొచ్చిందని ఎమ్మెల్యే రాములు నాయక్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఈ సంవత్సరం కోటి 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి జరిగిందని వివరించారు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం విశ్వనాథ పల్లిలో ఏర్పాటైన ధాన్యం కొనుగోలు ప్రారంభోత్సవానికి ఆయన హాజరయ్యారు.
కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూడాలని అధికారులను ఆదేశించారు ఎమ్మెల్యే. రైతులంతా కొవిడ్ నిబంధనలు పాటిస్తూ కొనుగోలు కేంద్రాలకు రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ ఛైర్మన్ కూరాకుల నాగభూషణం, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
ఇది చదవండి: శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత