ఖమ్మం జిల్లా వైరా పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రాములు నాయక్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు.
ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వచ్చే సంక్షేమ ఫలాలు అందుతున్నాయని ఎమ్మెల్యే అన్నారు. పేదింటి ఆడపిల్ల పెళ్లి భారం కావద్దని కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ప్రవేశ పెట్టారని గుర్తు చేశారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
ఇదీ చూడండి : ప్రతిధ్వని: స్కూళ్లు తెరుచుకుంటాయా.. తరగతుల నిర్వహణ సాధ్యమేనా?