ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలోని రైతులకు రుణాల చెక్కులను వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ అందజేశారు. మొత్తం 305 మంది అన్నదాతలకు రూ.80 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు.
గతంలో ప్రభుత్వాలు ఈస్థాయిలో రైతులకు రుణాలను పంపిణీ చేయలేదని.. కర్షకులు అన్నిరకాలుగా ఆర్థికంగా బలపడాలనే ప్రభుత్వం ప్రోత్సాహకం అందిస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ ఛైర్మన్ కూరాకుల నాగభూషణం, వైరా మార్కెట్ ఛైర్మన్ రోశయ్య, ఎంపీపీ శకుంతల, జెడ్పీటీసీ జగన్, సర్పంచ్ స్రవంతి పాల్గొన్నారు.
ఇదీ చూడండి: సన్న వరి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి: రైతు సంఘం