ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గొల్లగూడెం గ్రామంలో 30 రోజుల కార్యచరణ ప్రణాళిక ముగింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, కలెక్టర్ ఆర్వీ కర్ణన్ పాల్గొన్నారు. గత 30 రోజుల్లో గ్రామంలో జరిగిన అభివృద్ధిని కాలలినడకన తిరుగుతూ పరిశీలించారు. పల్లెలో జరిగిన అభివృద్ధి ఆదర్శనీయమని.. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు. అనంతరం తాజాగా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువతులను సన్మానించారు.
ఇదీ చదవండిః ఖమ్మంలో 30 రోజుల ప్రణాళిక పనులపై మంత్రి ఎర్రబెల్లి అసంతృప్తి