ఖమ్మం మార్కెట్ యార్డులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మిర్చి ధర ఒకేసారి రూ. 5000 తగ్గించడం వల్ల రైతులు మార్కెట్ గేటు మూసివేసి మరీ ఆందోళనకు దిగారు. మార్కెట్ ఛైర్మన్‌ను చుట్టుముట్టి ధర పెంచాలని డిమాండ్ చేశారు.
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. రైతులను అడ్డుకుని ఛైర్మన్‌ను తన కార్యాలయానికి సురక్షితంగా తరలించారు.
నిన్నటి వరకు క్వింటాలుకు రూ.18వేలు ఉన్న ధర.. ఇవాళ ఒక్కసారిగా 13వేలకు ఎలా తగ్గుతుందని రైతులు ప్రశ్నిస్తున్నారు. యార్కెట్ యార్డ్ అధికారులు తమకు న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ చూడండి: పద్దు 2020: నిర్మల బడ్జెట్‌తో 'ఆటో' గేర్ మారుతుందా?