వలస కూలీలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం మల్లుపల్లిలో ఆయన బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.
"లాక్డౌన్ సమయంలో ప్రజలకు ఇబ్బంది కలుగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. వలస కూలీలపై ప్రత్యేక దృష్టి సారించింది. వారికి అవసరమైన వసతులు కల్పిస్తోంది. కుటుంబాన్ని విడిచి ఇంత దూరం వచ్చి కష్టపడుతున్న వలసకూలీలు మనకు అతిథులు. వీరికి ధైర్యం చెప్పి... మంచిగా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. ఈ సమయంలో దాతలు, స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న సేవలు అభినందనీయం."
- మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్
ఇవీ చూడండి: జనవరి నుంచి ఆ దేశ క్రికెటర్లకు జీతాల్లేవ్