నిత్యం అధికారిక కార్యక్రమాల్లో బిజీగా ఉండే రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టారు. నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో లకారం ట్యాంక్‌బండ్‌పై నిర్వహించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, కార్పొరేటర్లతో కలిసి ట్యాంక్‌బండ్‌పై ఉన్న పిచ్చి మొక్కలను తొలగించారు. స్వయంగా చెత్త ఎత్తి ట్రాక్టర్లో పోశారు.
ట్యాంక్‌బండ్ మొత్తం కలియ తిరుగుతూ అభివృద్ధి కార్యక్రమాలపై నగర కమిషనర్‌కు పలు సూచనలు చేశారు. లకారం ట్యాంక్ బండ్‌ను ఎప్పుడూ క్లీన్ అండ్ గ్రీన్‌గా ఉంచుతామని.. త్వరలోనే సుందరీకరణ చేస్తామన్నారు. ఈ సందర్భంగా చెత్త ట్రాలీలను మంత్రి ప్రారంభించారు.
ఇవీ చూడండి : 'మహిళలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి'