ETV Bharat / state

Minister Puvvada on Tummala Nageswara Rao : 'మంత్రి పదవి ఇవ్వకపోతే.. రాజకీయాల నుంచి తుమ్మల ఎప్పుడో రిటైర్ అయ్యేవారు'

Minister Puvvada on Tummala Nageswara Rao : కేసీఆర్‌ వల్లే తుమ్మల నాగేశ్వరరావుకు మంత్రి పదవి వచ్చిందని.. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ గుర్తు చేశారు. ఆయన ఓటమికి ఉపేందర్‌రెడ్డికి డబ్బులు ఇచ్చినట్లు ఆరోపిస్తున్నారని.. టికెట్‌ ఇచ్చి ఓటమి కోసం డబ్బులిస్తారా ఎక్కడైనా..? అని పువ్వాడ ప్రశ్నించారు.

Puvvada Ajay Kumar
Puvvada Ajay Kumar
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 28, 2023, 12:19 PM IST

Updated : Oct 28, 2023, 1:05 PM IST

Minister Puvvada on Tummala Nageswara Rao మంత్రి పదవి ఇవ్వకపోతే రాజకీయాల నుంచి తుమ్మల ఎప్పుడో రిటైర్ అయ్యేవారు

Minister Puvvada on Tummala Nageswara Rao : ముఖ్యమంత్రి కేసీఆర్‌పై.. మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత తుమ్మల నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. పదవుల కోసం తుమ్మల అధమస్థాయికి దిగజారారని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ (Puvvada Ajay Kumar) ఆరోపించారు. కేసీఆర్‌ గురించి ఆయన ఇష్టారీతిన మాట్లాడటం బాధాకరమని అన్నారు. 2014లో మంత్రి పదవి ఇచ్చి ఉండకపోతే తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే రిటైర్‌ అయ్యేవారని ఎద్దేవా చేశారు. ఖమ్మం జిల్లాలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

BRS Leader Comments on Tummala Nageswara Rao : తుమ్మల నాగేశ్వరరావుపై (Tummala Nageswara Rao) ఆధారపడి కేసీఆర్‌ అధికారంలోకి వచ్చారా అని పువ్వాడ అజయ్‌కుమార్ ప్రశ్నించారు. కేసీఆర్‌కు మంత్రి పదవి ఇప్పించినట్లు ఆయన ఆరోపిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌, తుమ్మల నాగేశ్వరరావు ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చారని.. కేసీఆర్‌కు తుమ్మల మంత్రి పదవి ఇప్పించారనేది హాస్యాస్పదమని అన్నారు. ముఖ్యమంత్రి వల్లే తుమ్మల నాగేశ్వరరావుకు మంత్రి పదవి వచ్చిందని పువ్వాడ అజయ్‌కుమార్ గుర్తు చేశారు.

Puvvada Fires on Congress Party : 'కాంగ్రెస్ పార్టీ మా పథకాలనే కాపీ కొట్టి.. మళ్లీ మమ్మల్నే కాపీ క్యాట్ అంటోంది'

తుమ్మల నాగేశ్వరరావు ఓటమికి.. ఉపేందర్‌రెడ్డికి డబ్బులు ఇచ్చినట్లు ఆరోపిస్తున్నారని పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. తుమ్మలకు టికెట్‌ ఇచ్చి ఓటమి కోసం డబ్బులిస్తారా అని ప్రశ్నించారు. ఆయన టికెట్‌ ఇచ్చి ఉండకపోతే సరిపోయేది కదా అని అన్నారు. తుమ్మల నాగేశ్వరరావు ఎప్పుడూ జైతెలంగాణ నినాదం చేయలేదని.. కానీ జైతెలంగాణ నినాదం చేసినవారిని తుమ్మల జైలు పాలుచేశారని పువ్వాడ అజయ్ కుమార్ ఆరోపించారు.

"పదవుల కోసం తుమ్మల అధమస్థాయికి దిగజారారు. కేసీఆర్‌ గురించి తుమ్మల ఇష్టారీతిన మాట్లాడటం బాధాకరం. 2014లో మంత్రి పదవి ఇచ్చి ఉండకపోతే తుమ్మల ఇప్పటికే రిటైర్‌ అయ్యేవారు. తుమ్మలపై ఆధారపడి కేసీఆర్‌ అధికారంలోకి వచ్చారా?. కేసీఆర్‌కు మంత్రి పదవి ఇప్పించినట్లు ఆరోపిస్తున్నారు. కేసీఆర్‌, తుమ్మల ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చారు. కేసీఆర్‌కు తుమ్మల మంత్రి పదవి ఇప్పించారనేది హాస్యాస్పదం." - పువ్వాడ అజయ్‌కుమార్, మంత్రి

Nama Nageswara Rao Fires on Tummala : శుక్రవారం రోజున ముఖ్యమంత్రి కేసీఆర్ అన్న మాటలను చూసి.. తుమ్మల నాగేశ్వరరావు ఉలిక్కిపడాల్సిన అవసరం లేదని బీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత నామ నాగేశ్వరరావు (Nama Nageswara Rao) అన్నారు. పాలేరు ప్రజల సాక్షిగా తమ్మలపై.. సీఎం మాట్లాడిన మాటలు వందశాతం నిజమేనని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో మీరు ఎన్నిపార్టీలైనా మారండని అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పారు. కానీ ఆదరించి, అభిమానించినవారి పట్ల తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడినా మాటలను ఖండిస్తున్నానని నామ నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు.

Political Heat in Khammam District : రసవత్తరంగా ఖమ్మం రాజకీయం.. నువ్వానేనా అంటూ బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ ఢీ

అసలేం జరిగిదంటే : సీఎం కేసీఆర్ శుక్రవారం రోజున ఖమ్మం జిల్లా పాలేరులో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజాఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు పువ్వాడ అజయ్‌కుమార్ చేతిలో ఓడిపోయారని ఆయన గుర్తు చేశారు. స్నేహితుడనే ఉద్దేశంతో ఓడిపోయిన వ్యక్తిని పిలిచి మంత్రి పదవి ఇచ్చానని తెలిపారు. కేసీఆర్ వ్యాఖ్యలకు.. తుమ్మల నాగేశ్వరరావు కౌంటర్ ఇచ్చారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి తనపై పచ్చి అబద్ధాలు మాట్లాడారని.. 1995లో కేసీఆర్‌కు తానే మంత్రి పదవి ఇప్పించిన విషయం మరిచారని తుమ్మల పేర్కొన్నారు.

Puvvada vs Tummala in Khammam : సమఉజ్జీల సమరం.. ఖమ్మంలో కాకరేపుతున్న పువ్వాడ వర్సెస్ తుమ్మల రాజకీయం

Tummala Nageswara Rao Interesting Comments : ఈ ఎన్నికల్లో ఖమ్మం ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇవ్వాలి : తుమ్మల

Last Updated : Oct 28, 2023, 1:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.