ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా రెండు పడక గదుల ఇళ్లను ఆయన ప్రారంభించారు. ఇళ్ల నిర్మాణాల్లో వర్షం నీరు నిలవకుండా చూసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.
విశ్వనాధపల్లిలో ఆధునిక వ్యవసాయ యాంత్రాలను పరిశీలించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్టు ద్వారా కారేపల్లి మండలానికి కూడా సాగునీరు వస్తుందని మంత్రి తెలిపారు.
దసరా నాటికి ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రైతు వేదికల నిర్మాణాలు పూర్తవుతాయని అన్నారు. రాబోయే రోజుల్లో ఏ కాలంలో ఏ పంట వేయాలో నిర్ణయించి పంటలు అధిక దిగుబడి సాధిస్తామని వెల్లడించారు.
ఇదీ చూడండి : ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుపై శ్రద్ధ పెట్టండి: మాణిక్కం ఠాగూర్