ఆర్టీసీ బస్సులు, ఆటోలు రోడ్డుమీదకు వచ్చినప్పుడే నా మనసుకు ప్రశాంతత కలుగుతుందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. ఖమ్మం నగరంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో సుమారు 1000 మంది ఆటో డ్రైవర్లకు పోలీసుల ఆధ్వర్యంలో నిత్యావసరాలు పంపిణీ చేశారు.
జిల్లాలో కరోనా విస్తరించకుండా కలెక్టర్, సీపీ ప్రత్యేక చర్యలు తీసుకున్నారని మంత్రి పేర్కొన్నారు. జిల్లా త్వరలోనే గ్రీన్ జోన్‌లోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అంత వరకు ప్రజలు ఓపిక పట్టాలన్నారు. రోడ్డు మీదకు వచ్చిన తర్వాత ఆటోడ్రైవర్లు నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీని ఎలా నడపాలో ఆలోచిస్తున్నామన్నారు. కార్యక్రమంలో మేయర్ పాపాలాల్, కలెక్టర్ ఆర్.వి.కర్ణన్, డీసీపీ మురళీధర్ తదితరులు పాల్గొన్నారు.