ఖమ్మం జిల్లా తల్లాడలో వ్యవసాయ పొలాల్లో కొనసాగుతున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పరిశీలించారు. నూతనకల్లు సమీపంలో ఎన్ఎస్పీ మైనర్ కాలువల్లో నిర్వహిస్తున్న ఉపాధి పనులను పర్యవేక్షించి రైతులతో మాట్లాడారు. ప్రత్యేకంగా కాలువల మరమ్మతులపై జరుగుతున్న పనులను ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మంత్రికి వివరించారు.
అనంతరం కాలువ కట్టపై ఆరోవిడత హరితహారం కార్యక్రమంలో భాగంగా మంత్రి మొక్కలు నాటారు. కట్టలపై శుభ్రంగా ఉండే విధంగా చెత్త తొలగింపు, పూడిక తీసే పనులను నిర్వహిస్తున్నందుకు మంత్రి అభినందించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు కలెక్టర్ ఆర్వీ కర్ణన్, డీసీఎంఎస్ ఛైర్మన్, ప్రజాప్రతినిధులు పాల్గొని మొక్కలు నాటారు.