కొవిడ్ సమయంలో కూడా ప్రజాసంక్షేమ కార్యక్రమాలకు లోటు లేకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ నిధులు మంజూరు చేస్తున్నారని రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. ఖమ్మం నగరంలోని క్యాంపు కార్యాలయంలో 73 మంది లబ్ధిదారులకు రూ. 31.37 లక్షల విలువైన సీఎం సహాయనిధి చెక్కులను ఆయన అందచేశారు.
తన నియోజకవర్గంలోని పేదలకు అనారోగ్యం వస్తే ఆర్థికంగా చితికి పోకుండా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఎంతో కొంత ఆర్థిక సాయం చేస్తున్నామన్నారు. జిల్లాలో ఇంత వరకు రూ.3.69 కోట్ల విలువైన చెక్కులను అందజేశామన్నారు.
ఇవీ చూడండి: రెవెన్యూ చట్టానికి మద్దతుగా కరివెన వద్ద తెరాస కృతజ్ఞతా సభ