సుమారు 2 కోట్ల రూపాయల విలువైన 250 ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లును రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్‌కు అందచేశారు. పువ్వాడ ఫౌండేషన్, ఇండియన్ ఫ్రెండ్స్ ఆఫ్ అట్లాంట ఆధ్వర్యంలో.. జిల్లాలో ఉన్న కొవిడ్ రోగులకు కోసం తెప్పించినట్లు మంత్రి తెలిపారు.
ఇంటి వద్ద ఉండి చికిత్స తీసుకునే వాళ్లలో ఆక్సిజన్ అవసరం ఉన్న వారికి ఇంటి వద్దకే సరపరా చేస్తామని మంత్రి పువ్వాడ పేర్కొన్నారు. ప్రజలందరూ కరోనా నిబంధనలను పాటించాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని... ఒకవేళ వచ్చినా మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించాలని సూచించారు.
ఇదీ చదవండి : భూముల సమగ్ర సర్వేపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష