ETV Bharat / state

Minister Puvvada: 'గిరిజనుల సమస్యలు పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం' - మంత్రి పువ్వాడ అజయ్

గిరిజనుల సమస్యలు పరిష్కరించేందుకు తెరాస ప్రభుత్వం కృషిచేస్తోందని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ పేర్కొన్నారు. పోడు సాగుదారులకు హక్కులు కల్పించడంతోపాటు.. పోడు పేరిట సాగుతున్న అటవీ భూముల ఆక్రమణలకు చెక్ పెట్టేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని తెలిపారు. రాష్ట్రస్థాయిలోనే ఈ సమస్యకు పరిష్కారం చూపాలని సీఎం కేసీఆర్ యోచిస్తున్నారని వెల్లడించారు.

Minister Puvvada
Minister Puvvada
author img

By

Published : Nov 2, 2021, 12:41 AM IST

పోడు సాగుదారులకు హక్కులు కల్పించడంతోపాటు.. పోడు పేరిట సాగుతున్న అటవీ భూముల ఆక్రమణలకు చెక్ పెట్టేందుకు తెరాస ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా పరిషత్ కార్యాలయంలో పోడు భూముల సమస్యలు, అడవుల పరిరక్షణపై నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతిపక్షాలు సూచించిన ప్రతీ అంశాన్ని పరిగణలోకి తీసుకొని అందరి భాగస్వామ్యంతోనే పోడుభూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని మంత్రి అన్నారు.

గత ప్రభుత్వాలు కంటి తుడుపు చర్యలు చేపట్టినా.. గిరిజనుల సమస్యలు పరిష్కరించేందుకు తెరాస ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రాష్ట్రస్థాయిలోనే ఈ సమస్యకు పరిష్కారం చూపాలని సీఎం కేసీఆర్ యోచిస్తున్నారని తెలిపారు. గతంలో వచ్చిన పోడు దరఖాస్తులను ప్రభుత్వం తిరస్కరించలేదని పేర్కొన్నారు. పోడు భూముల్లో గిరిజనుల పేరుతో గిరిజనేతరుల ఆగడాలు మాత్రం సాగనివ్వబోమన్నారు.

మాటల్లో కాకుండా చేతల్లో చూపాలి..

పోడు సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం మాటల్లో కాకుండా చేతల్లో చూపాలని ప్రతిపక్ష పార్టీల ప్రతినిధులు సూచించారు. సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం చొరవను అభినందిస్తూనే.. వీలైనంత త్వరగా శాశ్వత పరిష్కారం చూపాలని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు సూచించారు.

ఇదీ చదవండి: Madhuyashki: 'తెరాస విధానాలకు వ్యతిరేకంగా జనజాగరణ యాత్ర'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.