గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాల కారణంగా ప్రభుత్వాసుపత్రుల్లో వసతులు కరవయ్యాయని మంత్రి పువ్వాడ ఆరోపించారు. దీనిని తెరాస సర్కారు గుర్తించి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా కృషి చేస్తున్నట్లు వివరించారు. ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా మధిరలో కొవిడ్ కేంద్రాన్ని మంత్రి పువ్వాడ ప్రారంభించారు.
నియోజకవర్గ కేంద్రమైన మధిర సివిల్ ఆస్పత్రి అభివృద్ధి చేస్తామని తెలిపారు. కార్యక్రమానికి సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క హాజరయ్యారు. కొవిడ్ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని కోరారు. వ్యాక్సిన్ల సంఖ్యను, పరీక్షల సంఖ్యను పెంచాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి పీహెచ్సీలోనూ ఆక్సిజన్ పడకలు ఏర్పాటు చేయాలని సూచించారు.
ఇదీ చూడండి: రామగుండం కర్మాగారంలో అమ్మోనియా లీక్.. ప్రాణభయంతో స్థానికులు