వ్యవసాయంలో యాంత్రీకరణ ఎంతో అవసరమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అజయ్ కుమార్ తెలిపారు. ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో బయర్ కంపెనీకి చెందిన మందులు పిచికారి ట్రాక్టర్లను మంత్రి ప్రారంభించారు. ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగిందన్నారు.
కూలీల కొరతకు యాంత్రీకరణ ఒక్కటే మార్గమని మంత్రి అభిప్రాయపడ్డారు. సీఎం కేసీఆర్ సారు తీసుకువచ్చిన సమగ్ర సాగు విధానం తో రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు.. ఈ స్ప్రే ట్రాక్టర్ల వల్ల ఎకరం పంటకు పదిహేను నిమిషాల్లోనే మందు పిచికారి చేయవచ్చన్నారు. ఖర్చు కూడా చాలా తక్కువ అని వివరించారు.