ఖమ్మం పోలీసు పరేడ్ మైదానంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మంత్రి అజయ్‌కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఖమ్మం జిల్లాలో కరోనా పాజీటివ్ రేటును చాలా వరకు తగ్గించామని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. అందుకోసం ఎల్లవేళలా కృషి చేసిన వైద్యారోగ్య సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.
జిల్లాకు సరి హద్దులుగా ఆంధ్ర రాష్ట్రం ఉన్నందు వల్లే ఖమ్మంలో కరోనా కేసుల సంఖ్య పెరిగిందని మంత్రి తెలిపారు. ప్రత్యేక ప్రణాళికతో కరోనాను నియంత్రించామని అన్నారు. లాక్‌డౌన్ ఎత్తి వేసిన తర్వాత కూడా ప్రత్యేక కార్యచరణ కోనసాగుతుందన్నారు. జిల్లాలోని అన్ని సమస్యలు పరిష్కరించుకుని అభివృద్ధిలో ముందు ఉంటున్నామని మంత్రి పువ్వాడ అన్నారు.
ఇదీ చదవండి : Diagnostics: కరోనా నిర్ధారణ పరీక్షకు వెళ్తే నిలువు దోపిడీ