ఖమ్మం జిల్లా వైరాలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎంపీ నామ నాగేశ్వర్రావు పర్యటించారు. రూ.20 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పలు వీధుల్లో కలియ తిరుగుతూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వైరా పురపాలక అభివృద్ధికి కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల అభివృద్ధిపై మంత్రి కేటీఆర్ ప్రత్యేక దృష్టి సారించారన్నారు. ఎమ్మెల్యే రాములు నాయక్ కోరిక మేరకు వైరాలో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేశారని మంత్రి వివరించారు.
ఇదీ చూడండి: అయేషా గోళ్లు, ఎముకలు, కేశాల పరిశీలన