రాష్ట్రవ్యాప్తంగా సూపర్ స్ప్రెడర్లకు టీకాలు వేసే కార్యక్రమం కొససాగుతోందని... మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. టీకా తీసుకోవడం ద్వారా వైరస్ ముప్పు తక్కువగా ఉంటుందని, దాని వల్ల మనతో పాటు మన కుటుంబానికి కూడా రక్షణ కల్పిస్తుందని అన్నారు. ఖమ్మం జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో మెగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
వ్యాక్సినేషన్ కోసం జిల్లాలో ఆటో డ్రైవర్లు తక్కువ మంది పేర్లు నమోదు చేయించుకుంటున్నారని మంత్రి తెలిపారు. టీకా వేయించుకునేందుకు అందరూ ముందుకు రావాలన్నారు. ఖమ్మం నగరాన్ని సురక్షిత నగరంగా రూపొందిస్తామని హామీ ఇచ్చారు. దీని కోసం నెల రోజుల్లో సుమారు లక్ష మందికి కొవిడ్ టీకాలు వేయటం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
ఇదీ చదవండి: Wuhan lab: కరోనాపై నోరువిప్పిన వైరాలజిస్ట్