కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా తెరాస లోక్‌సభాపక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు రూ.2.10 కోట్ల విలువైన శానిటైజర్, మాస్క్‌లను పంపిణీ చేస్తున్నారు. నామా ముత్తయ్య ట్రస్టు ద్వారా నేలకొండపల్లిలోని తన చక్కెర కార్మాగారంలో 25 వేల లీటర్ల శానిటైజర్, 3 లక్షల మాస్క్‌లను ఆయన తయారు చేయించారు. ఖమ్మం జడ్పీ సమావేశ మందిరంలో శుక్రవారం రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఈ శానిటైజర్లు, మాస్కుల పంపిణీకి శ్రీకారం చుట్టారు.
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో వీటిని పంపిణీ చేయనున్నట్లు ఎంపీ నామా తెలిపారు. ఇప్పటికే ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో 1.90 లక్షల మాస్కులు, 40,304 నీళ్ల సీసాలు అందించినట్లు చెప్పారు. ఎమ్మెల్యే వెంకటవీరయ్య, జడ్పీ ఛైర్మన్ కమల్‌రాజు, కలెక్టర్ కర్ణన్ పాల్గొన్నారు.
ఇవీచూడండి: దేశవ్యాప్తంగా 35వేలు దాటిన కరోనా కేసులు