వరంగల్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు ఖమ్మం వద్ద మున్నేరు నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. మున్నేరు ఉద్ధృతిని రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పరిశీలించారు. పాత వంతెన పైనుంచి వరద ప్రవాహాన్ని చూశారు. జిల్లా కలెక్టర్, ఇరిగేషన్ అధికారులతో మాట్లాడారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వరద పరిస్థితిని ఎప్పటికప్పడు తెలుసుకుని ముంపు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నట్లు మంత్రి చెప్పారు. ఖమ్మం నగరంలో సుమారు 350 కుటుంబాలు ముంపునకు గురయ్యాయని తెలిపారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ముంపు మండలాలకు అధికారులు వెళ్లి బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించామని పేర్కొన్నారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా తగు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. నగరంలోని పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. ప్రధానంగా బొక్కల గడ్డ బజార్, మంచికంటినగర్, వెంకటేశ్వర కాలనీ, మోతినగర్‌లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లల్లోకి వరద నీరు చేరింది.
ఇదీ చూడండి 'నాన్నా జాగ్రత్త.. ముద్దివ్వొద్దు, ముట్టుకోవద్దు!'