ఆరో విడత హరితహారంలో భాగంగా ఖమ్మం నగరంలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పలు డివిజన్లలో మొక్కలు నాటారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట గోడకు అమర్చిన వర్టికల్ గార్డెన్‌ను ఆయన ప్రారంభించారు. రాబోయే తరాలకు మంచి వాతావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ తమ ఇంటి ముందు మొక్కలు నాటాలని కోరారు.
అనంతరం నగరంలోని 22వ డివిజన్‌లో లకారం వాగుపై మొక్కలు నాటారు. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లని తెలిపారు. మొక్కలను సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో కలెక్టర్ కర్ణన్, ఎమ్మెల్సీ బాలసాని, మేయర్ పాపాలాల్, కమిషనర్ అనురాగ్ పాల్గొన్నారు.