ETV Bharat / state

'యాదాద్రి కంటే గొప్పగా భద్రాద్రిని అభివృద్ధి చేస్తాం'

Minister KTR Roadshow at Khammam : బీఆర్ఎస్​ను గెలిపిస్తే భద్రాచలంలో గోదారి వరదలకు శాశ్వత పరిష్కారం చూపిస్తానని మంత్రి కేటీఆర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా భద్రాచలం, ఇల్లందు రోడ్ షోలో పాల్గొన్న కేటీఆర్‌.. కాంగ్రెస్‌ ఓట్లేసి ఆగమాగం కావద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజలు డబ్బులకి అమ్ముడుపోకుండా గులాబీ అభ్యర్థులను గెలిపించుకోవాలని తెలిపారు.

Telangana Assembly Election 2023
Minister KTR Roadshow at Khammam
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 19, 2023, 3:30 PM IST

Updated : Nov 19, 2023, 6:29 PM IST

Minister KTR Roadshow at Khammam : శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్​ను గెలిపిస్తే భద్రాచలంలో గోదారి వరదలకు శాశ్వత పరిష్కారం చూపిస్తానని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా భద్రాచలం, ఇల్లందు రోడ్ షోలో పాల్గొన్న కేటీఆర్‌.. కాంగ్రెస్‌ ఓట్లేసి ఆగమాగం కావద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. కత్తి ఒకరికి ఇచ్చి యుద్ధం(Election War) మమ్మల్ని చేయమంటే ఎలా.. కాంగ్రెస్​కు ఓట్లు వేసి మమ్మల్ని అభివృద్ధి చేయమంటే ఎలా అని ప్రశ్నించారు. ఎన్నికల వేళ ప్రజలు డబ్బులకు అమ్ముడుపోకుండా గులాబీ అభ్యర్థులను గెలిపించుకోవాలని తెలిపారు.

నేను రష్మిక అంత ఫేమస్‌ కాదు - డీప్‌ ఫేక్‌ మహిళలకే కాదు, రాజకీయ నాయకులకూ ప్రమాదకరం : కేటీఆర్

భద్రాచలం వచ్చినప్పుడు కచ్చితంగా రాముని వారి పాదాలకి నమస్కరించాలని అనుకున్నానని.. అధికారుల విజ్ఞప్తి మేరకు ఆలయానికి వెళ్లలేదని మంత్రి తెలిపారు. కానీ మరొక పది రోజుల తర్వాత భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుతో కలిసి వారం రోజులు ప్రశాంతంగా రాముని దర్శించుకుంటానని మాట ఇస్తున్నానని అన్నారు. గతంలో భద్రాచలంలో కరెంటు పరిస్థితి, సాగుబడి పరిస్థితి ఎలా ఉంది.. ఇప్పుడు సీఎం కేసీఆర్(CM KCR) పాలన తర్వాత ఎలా ఉందని ప్రశ్నించారు. ఇక్కడ జరుగుతున్న అన్ని సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు కళ్ల ముందే కనిపిస్తున్నాయని వివరించారు.

యాదాద్రి కంటే గొప్పగా భద్రాచలం రామాలయ అభివృద్ధి : రాష్ట్రంలో మరోసారి రాబోయేది తమ ప్రభుత్వమేనని.. ముఖ్యమంత్రి కేసీఆర్​నే అని ధీమా వ్యక్తం చేశారు. గతంలో కారణాలు ఏవైనప్పటికీ ఖమ్మం ప్రజలు తమకు అవకాశం ఇవ్వలేదు.. కానీ ఈసారి మాత్రం కచ్చితంగా గులాబీ వనంలో భద్రాచలం చేరాలని.. కారు గుర్తు అభ్యర్థి గెలవాలని కేటీఆర్ కోరారు. యాదాద్రి కంటే గొప్పగా భద్రాచలం రామాలయాన్ని అభివృద్ధి చేస్తామని మంత్రి ప్రకటించారు. గత రెండు పర్యాయాలు తమ అభ్యర్థిని గెలిపించక పోయినప్పటికీ కొన్ని కార్యక్రమాలు చేశామన్ని మంత్రి.. ఈసారి పూర్తిస్థాయిలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు.

మాకు రాములావారి మీద చిన్న చూపు కాదు. అపారమైన భక్తి, ప్రేమ ఉంది. నేను మీకు మాట ఇస్తున్నా.. ఇవాళ యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం ఎంతైతే అభివృద్ధి చేసుకున్నామో, అంతే గొప్పగా ఇక్కడ రాములవారి థీమ్ పార్క్​ను, భద్రాద్రి గుడిని బ్రహ్మాండంగా చేసుకుందాం. గత ఎన్నికల్లో రెండు పర్యాయాలు మా అభ్యర్థిని మీరు గెలిపించకుపోయినా.. కొన్ని పనులను చేశాం. ఇంకా ముఖ్యమైన పనులు చేయాలంటే తప్పకుండా రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆర్ కాబట్టి.. ఇక్కడ కూడా బీఆర్ఎస్ అభ్యర్థి ఉంటే అభివృద్ధి పరుగులు పెడుతుంది.-కేటీఆర్, రాష్ట్ర మంత్రి

మా ధైర్యం తెలంగాణ ప్రజలు - బీఆర్ఎస్​ను వాళ్లే కాపాడుకుంటారు : మంత్రి కేటీఆర్

BRS Election Campaign in Khammam : ఒక్క ఛాన్స్ ఇవ్వమని కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది కానీ ఇప్పటివరకు 11 ఛాన్స్​లు ప్రజలు ఇచ్చారన్నారు. కానీ ఏమి అభివృద్ధి చేశారని హస్తంపై విరుచకుపడ్డారు. మళ్లీ అటువంటి పొరపాటు చేయవద్దని ప్రజలను కోరారు. బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రావును గెలిపిస్తే ప్రతి మండలంలో కోల్డ్ స్టోరేజ్(Cold Storage) నిర్మిస్తామన్నారు. అదేవిధంగా వెంకటాపురం మండలంలో జూనియర్ కాలేజీని నిర్మిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. నియోజకవర్గం ప్రజలు ఏమి కోరితే అదే చేస్తామని.. తమకు ఎటువంటి బేషజాలు లేవని కేటీఆర్ అన్నారు.

'బీఆర్ఎస్​ను గెలిపిస్తే భద్రాచలంలో గోదారి వరదలకు శాశ్వత పరిష్కారం కల్పిస్తాం'

ఖమ్మంలో పాత రికార్డులు మారాలి..: ఖమ్మం జిల్లాలో ఈసారి ఎన్నికల్లో పాత రికార్డులు మారాలని మంత్రి కేటీఆర్ ప్రజలను కోరారు. ప్రచారంలో భాగంగా ఇల్లందులో నిర్వహించిన రోడ్ షోలో మంత్రి పాల్గొని.. హస్తం పార్టీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చిన తొలి విడతలోనే(First Installment) 24 గంటల కరెంట్ ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదని కొనియాడారు. 11 సార్లు అవకాశం పొందిన కాంగ్రెస్‌ 24 గంటల కరెంట్ ఇచ్చిందా అని ప్రశ్నించారు. చిన్నచిన్న అసంతృప్తులను పక్కనబెట్టి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఖమ్మం జిల్లాలో గత రెండు ఎన్నికల్లో టీఆర్ఎస్​కు ఒక్కో సీటు మాత్రమే వచ్చిందని.. ఆ లెక్క ఇప్పుడు మారాలని కోరారు.

సమయం దగ్గరకు వస్తోంది- నాయకుల్లో జోరు పెరిగింది, పోటా పోటీగా ప్రచారం చేస్తున్న నేతలు

పకడ్బందీ చర్యలు, క్షేత్రస్థాయి కార్యాచరణతో ఫిర్యాదులు తగ్గుతూ వస్తున్నాయి : సీఈవో వికాస్​ రాజ్

Last Updated : Nov 19, 2023, 6:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.