ETV Bharat / state

అభివృద్ధి పనుల పూర్తికి చర్యలు చేపట్టండి : భట్టి విక్రమార్క - khammam latest news

Minister Bhatti Vikramarka Review on Khammam Development Works : ఖమ్మం జిల్లాలో పెండింగ్​ పనుల పూర్తికి చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులకు సూచించారు. మంగళవారం ఖమ్మం జిల్లా మధిరలోని క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్​, వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

Minister Bhatti Vikramarka
Minister Bhatti Vikramarka Review on Khammam Development Works
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 16, 2024, 10:33 PM IST

Minister Bhatti Vikramarka Review on Khammam Development Works : వివిధ శాఖల అధికారులందరూ సమన్వయంతో పనిచేసి జిల్లాలో అసంపూర్తి అభివృద్ధి పనులను పూర్తి చేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Minister Bhatti) పేర్కొన్నారు. మంత్రి ఖమ్మం జిల్లాలో పర్యటించి అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నియోజకవర్గంలో వివిధ శాఖల సమన్వయంతో పురోగతిలో ఉన్న పనుల పూర్తికి చర్యలు వేగం చేయాలన్నారు. మధిర మున్సిపల్​ పరిధిలో టెండర్ ప్రక్రియ పూర్తిచేసి పనులపై దృష్టి పెట్టాలన్నారు.

బడ్జెట్‌ 2024-25పై కసరత్తు - ఈనెల 18 నుంచి శాఖల వారీగా సమీక్షలు

వీధి వ్యాపారుల సమస్యలు పరిష్కరించాలని, ట్రాఫిక్ లేకుండా వుండే రహదారిపై వారికి వ్యాపారం చేసుకునేలా అవకాశం కల్పించాలన్నారు. ట్యాoక్ బండ్​పై రోడ్డు వెడల్పుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అంబారిపేట చెరువులో గణేష్ నిమజ్జనానికి బదులు ప్రత్యామ్నాయ చెరువును గుర్తించాలన్నారు. వేసవిలో త్రాగునీటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని తెలిపారు. మధిర చుట్టూ ఉన్న రోడ్లను కలుపుతూ ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్​ను ఆదేశించారు.

Minister Bhatti Latest News : జిల్లాలో రోడ్లు, భవనాల శాఖచే చేపట్టాల్సిన నూతన పనులు, బీటీ రోడ్ల అభివృద్ధిపై ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. విద్యార్థులు లేక మూతబడిన పాఠశాలల భవనాలను, ఇతర ప్రదేశాల్లో నడుస్తున్న రెసిడెన్షియల్ పాఠశాలలకు కేటాయించాలన్నారు. నియోజకవర్గంలో 3 ఎస్సీ, 4 బీసీ, ఒక మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలు ఉండగా, సొంత భవనాలు లేని వాటికి స్థల కేటాయింపు చేసి భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు సమర్పించాలన్నారు.

ఫార్ములా ఈ రేస్‌ వల్ల రాష్ట్రానికి ఎలాంటి ఆదాయం లేదు: భట్టి విక్రమార్క

కట్టలేరు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఉప ముఖ్యమంత్రి తెలిపారు.. జాలిముడి పనులు అసంపూర్తిగానే అప్పగించారని, మిగులు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. జాలిముడి ప్రాజెక్ట్ రెండో దశ పనులకు సర్వే ప్రక్రియ చేపట్టాలన్నారు. జాలిముడి కుడి, ఎడమ కాల్వల ఆధునికీకరణ చేయాలన్నారు. స్నానాల లక్ష్మీపురం దేవాలయాన్ని అభివృద్ధి చేయలన్నారు. నదికి ఇరువైపులా స్నానఘట్టాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.

మధిర పెద్ద చెరువు, జమలాపురం, ఇంద్రాయ చెరువులకు ట్యాంక్​బండ్లను అభివృద్ధి చేయాలన్నారు. నియోజకవర్గ పరిధిలో సొంత భవనాలు లేని గ్రామ పంచాయతీలకు నూతన భవన నిర్మాణాలు చేపట్టి, ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నవాటి జాబితా ఇవ్వాలన్నారు. కనెక్టివిటీ లేని అనుబంధ గ్రామాలకు రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ తరగతుల నిర్వహణకు చర్యలు చేపట్టాలన్నారు.

నియోజకవర్గ పరిధిలో 245 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, 89 పాఠశాలల్లో మన ఊరు-మన బడి కార్యక్రమంలో అభివృద్ధి పనులు చేపట్టారు. ఇందులో 50 పాఠశాలల్లో పనులు పూర్తికాగా, 14 పాఠశాలల్లో పెయింటింగ్ పనులు పూర్తయి పునః ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. ప్రయివేటు పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలు పాటించాలని, అధికారులు అన్ని పారామీటర్స్ తనిఖీలు చేయాలన్నారు.

అనంతరం రూ.34 కోట్లతో నూతనంగా నిర్మిస్తున్న 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణాన్ని క్షేత్ర స్థాయిలో ఉపముఖ్యమంత్రి పరిశీలించారు. ఆసుపత్రి బిల్డింగ్​ ప్లాన్​ను పరిశీలించి, అధికారులకు సూచనలు చేశారు. రూ 2.65 కోట్లతో నిర్మించిన మిని స్టేడియంను సందర్శించి పరిశీలించారు. మిగులు పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. 400 మీటర్ల అథ్లెటిక్ ట్రాక్, క్రికెట్ పిచ్, లాంగ్ జంప్ కోర్ట్, అవుట్ డోర్ ఖోఖో కోర్ట్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.

మాది ప్రజాస్వామ్య పాలన - తిరుగుబాటు ఉండదు : డిప్యూటీ సీఎం భట్టి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.