ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి అజయ్ కుమార్ పాల్గొన్నారు. ఖానాపురంలో 10 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. వైకుంఠధామం, కంపోస్టు ఎరువు, ప్రకృతివనంను ప్రారంభించారు. కల్యాణ లక్ష్మి 41 మంది లబ్ధిదారులకు మంత్రి చెక్కులు అందజేశారు.
ఇప్పటివరకు రాష్ట్రం ఏర్పడిన తర్వాత మధిర నియోజకవర్గానికి 35 కోట్ల 5 లక్షల 5 వేల రూపాయల కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశామన్నారు. ఒక్క ముదిగొండ మండలానికే 7 కోట్ల 50 వేల రూపాయల చెక్కులు పంపిణీ చేశామని మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో ప్రతి ఆడబిడ్డ కల్యాణం కోసం ఆర్థిక సాయం అందిస్తామని ఆయన తెలిపారు.
కరోనా కష్టకాలంలో కూడా రైతులకు రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్ అందిస్తున్నామని పువ్వాడ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్వి.కర్ణన్, జిల్లా పరిషత్ ఛైర్మన్ లింగాల కమల్ రాజు, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : నేడు ఈసెట్ పరీక్ష... కరోనా కాలంలో తొలి పరీక్ష