ఖమ్మం జిల్లా మధిర పురపాలక పరిధిలోని సాయి నగర్ కాలనీ వాసులు వారి వ్యథను అధికారులకు విన్నవించారు. కాలనీలో చిన్నపాటి వర్షానికి అంతర్గత రహదారులన్నీ జలమయం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మోకాలి లోతు బురదతో నడిచే పరిస్థితి లేదని వాపోయారు.
కాలనీ నుంచి పలువురు పురపాలక కార్యాలయానికి చేరుకొని ఇంఛార్జి కమిషనర్ కు సమస్యలు ఏకరువు పెట్టారు. స్పందించిన ఆయన సాయి నగర్ ను సందర్శించి సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.