ఖమ్మం జిల్లా మధిర సింగిల్ ఎంట్రీ చెక్‌పోస్టును స్థానిక ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క పరిశీలించారు. నిఘాను మరింత పటిష్ఠం చేయాలని అధికారులకు సూచించారు. మధిర నియోజకవర్గం చుట్టూ ఉన్న ఆంధ్రా ప్రాంతాలన్నీ రెడ్‌జోన్‌లో చేరాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని స్థానిక ఎమ్మెల్యే భట్టి ఎప్పటికప్పుడు ప్రజలను, అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. ఒక వైపు నుంచే మధిరలోకి ప్రవేశించేలా సింగిల్ ఎంట్రీ చెక్‌పోస్ట్‌ను జొన్నలగడ్డ, దేశినేని పాలెం మధ్యలో ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే భట్టి విక్రమార్క ఈ చెక్‌పోస్ట్‌ను తరచూ సందర్శించి మార్గనిర్దేశం చేస్తున్నారు.
ఇదీ చదవండి: సీఎంకు పీసీసీ కోవిడ్-19 టాస్క్‌ఫోర్స్ కమిటీ లేఖ