ఖమ్మం జిల్లా మధిర పెద్ద చెరువు అలుగు ఉద్ధృతంగా పొంగిపొర్లుతోంది. విస్తారంగా కురుస్తున్న వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చెరువులోకి చేరడం వల్ల నిండుకుండలా తొణికిసలాడుతోంది.
అలుగు ప్రవాహం.. సమీపంలోని పొలాలను ముంచుతూ వైరా నదిలో కలుస్తోంది. పొంగిపొర్లుతున్న చెరువు అలుగును పెద్దలు, పిల్లలు, మహిళలు భారీ సంఖ్యలో వచ్చి తిలకిస్తున్నారు. చెరువు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న శివారు కాలనీల్లోని ఇళ్ల చుట్టూ భారీగా వరద నీరు చేరింది.
ఇదీ చదవండి: జీహెచ్ఎంసీ చట్టసవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం