ఖమ్మం జిల్లా ప్రసిద్ధి గాంచిన నాచారం శ్రీ అద్భుత వెంకటేశ్వరస్వామి ఆలయం వార్షికోత్స పూజలు వైభవంగా జరిగాయి. స్వామివారికి వేద పండితులు పంచామృత అభిషేకాలు చేశారు. అనంతరం వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. వేంకటేశ్వరుని దర్శించుకునేందుకు జిల్లా నలుమూల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ కమిటీ ఏర్పాటుచేసిన సంగీత విభావరి ఆకట్టుకుంది. ఆలయ ప్రాంగణం స్వామి నామస్మరణతో మార్మోగింది. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఇవీ చూడండి: 'ఆయిల్ స్ప్రేతో మతబోధకుడి అరాచకాలు'