సీపీఐ, సీపీఎమ్, సీపీఐఎమ్ల్ పార్టీ కార్యకర్తలు ఖమ్మం కలెక్టరేట్ వద్ద ధర్నాకు దిగారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. దేశ చరిత్రలో మున్నపెన్నడూ లేని విధంగా రోజూ పెట్రోల్ ధరలు పెంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుంకాలను, పన్నులను తగ్గించాలన్నారు. కరోనా సమయంలో నిరుపేద కుటుంబాలకు రూ. 7500లు ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీ సైతం పెంచిన ధరలపై పోరాటం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి: నజర్ బోనంతో ప్రారంభమైన గోల్కొండ బోనాలు