ETV Bharat / state

'ప్రభుత్వ తీరు మారేవరకూ పోరాటం సాగిస్తాం' - మధిరలో కిసాన్​ మోర్చా నాయకుల ధర్నా

తెరాస ప్రభుత్వం తీరు మారేవరకు భాజపా పోరాటం కొనసాగిస్తుందని కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి తెలిపారు. మధిరలో ఎల్ఆర్​ఎస్​ను రద్దు చేయాలని తహసీల్దార్​ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. అనంతరం తహసీల్దార్​కు వినతిపత్రం అందజేశారు.

'ప్రభుత్వ తీరు మారేవరకూ పోరాటం సాగిస్తాం'

author img

By

Published : Sep 29, 2020, 9:01 PM IST

తెలంగాణలో తెరాస ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు మార్చుకునే వరకూ భాజపా నిరంతర పోరాటాలు చేస్తుందని ఆ పార్టీ అనుబంధ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్​ రెడ్డి వెల్లడించారు. ఖమ్మం జిల్లా మధిరలో భాజపా ఆధ్వర్యంలో ఎల్​ఆర్​ఎస్​ను రద్దు చేయాలని తహసీల్దార్​ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు.

కేంద్ర ప్రభుత్వం ప్రజలను ఆదుకునేందుకు సంక్షేమ పథకాలు తీసుకొస్తుంటే రాష్ట్రంలో మాత్రం తెరాస సర్కార్ ప్రజలను దోచుకునేందుకు ఎల్ఆర్ఎస్ జీవో తెచ్చిందని శ్రీధర్​ రెడ్డి మండిపడ్డారు. అనంతరం తహసీల్దార్​కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు చిలువేరు సాంబశివరావు, పట్టణ మండల అధ్యక్షుడు పాపట్ల రమేష్, గుండా శేఖర్ రెడ్డి పాల్గొన్నారు.

ఇదీ చదవండి: ఎల్‌ఆర్‌ఎస్ జీవో సవరించి రేపు విడుదల చేస్తాం : కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.